ఇప్పుడున్న ఏపీ ఫోటోలను చూపిస్తూ... మూడేళ్ల తరువాత ఇవే ఫోటోలను మళ్లీ చూపిస్తానన్న జగన్!

  • రాష్ట్రంలో అడుగంటిన అభివృద్ధి
  • మూడేళ్లలో మార్చి చూపిస్తా
  • సగర్వంగా చెబుతున్నానన్న జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిపోయిందని, గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన సీఎం వైఎస్ జగన్ 'నాడు-నేడు' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం డల్లాస్ లో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సౌకర్యాల లేమితో ఉన్న ఆసుపత్రులు, పాఠశాలల ఫోటోలను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. "ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తా ఉన్నాం. ప్రతి పాఠశాలనూ, ప్రతి హాస్పిటల్ నూ. ఇవాళ ఎలా ఉన్నాయి అని ఫోటోగ్రాఫ్ లు చూపిస్తా ఉన్నాం. ఇలా ఫోటోగ్రాఫ్ లు చూపించిన ఈ పాఠశాలల్లో, ఈ హాస్పిటళ్లలో వరుసగా, దశలవారీగా, ప్రతి సంవత్సరం ఇన్ని స్కూళ్లు చొప్పున, ఇన్ని హాస్పిటళ్ల చొప్పున మూడు సంవత్సరాలల్లో... ఆ ప్రతి ఫోటో గ్రాఫుల్లో నాడు, నేడు అంటూ చెప్పి చూపించే కార్యక్రమం చేయబోతున్నానని సగర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెబుతున్నాను" అని అన్నారు.
Go Back to Shorts
Jagan
Dallas
NRI
Schools
Hospitals

More Telugu News